ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు షాక్...

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు షాక్...

 న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కాగిసో రబాడా గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న రబాడా.. కనీసం మూడు నెలలు క్రికెట్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ అతన్ని 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడతను దూరం కావడం ఢిల్లీ టీమ్‌కు పెద్ద దెబ్బే. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లోనూ రబాడా గాయంతో బాధపడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 8 ఓవర్లే వేశాడు. ఆ తర్వాత స్కాన్ చేయగా.. గాయం ఉన్నట్లు తేలింది. జులైలో శ్రీలంకతో సిరీస్ సమయానికి రబాడా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ అయిన రబాడా.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 23 వికెట్లు తీశాడు.