ఫుట్‌బాల్‌  ఫైనల్లో భారత్‌

ఫుట్‌బాల్‌  ఫైనల్లో భారత్‌

  ఢాకా : సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(శాఫ్‌) ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిఫ్‌ సెమీఫైనల్లో భారత్‌ పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ దాయాది పాకిస్తాన్‌పై 3-1 గోల్స్‌ తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్ళింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ప్రత్యర్ధికి ఏ దశలోనూ గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. భారత్‌ తరఫున మన్వీర్‌సింగ్‌ రెండు, సుమీత్‌ పస్సి ఒక గోల్‌ చేశాడు.