ఫ్రెంచ్ ఓపెన్ సెమోనా హలెప్ కైవసం

ఫ్రెంచ్ ఓపెన్ సెమోనా హలెప్ కైవసం

  పారిస్: ఫ్రెంచ్ ఓపెన్- 2018 గ్రాండ్‌స్లమ్ టైటిల్‌ను సెమోనా హలెప్ కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో స్టోన్ స్టీఫెన్స్ పై 3-6, 6-4, 6-1 తేడాతో గెలుపొందింది. హలెప్ తన కెరీర్‌లో మొదటి గ్రాండ్‌స్లమ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో వర్జీనియా రుజిసి తర్వాత గ్రాండ్‌స్లమ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచిన రోమేనియన్ రెండవ మహిళగా హలెప్ నిలిచింది. హలెప్ ఇప్పటి వరకు మొత్తం నాలుగుసార్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించగా మూడుసార్లు ఓడిపోయింది. నాల్గొవ సారి టైటిల్‌ను గెలుపొందింది.