భారత స్విమ్మర్‌ రికార్డు

భారత స్విమ్మర్‌ రికార్డు

 న్యూఢిల్లీ: పుణెకు చెందిన లాంగ్‌ డిస్టెన్స్‌ స్విమ్మర్‌ రోహన్‌ మోరె.. సముద్రపు ఈతలో కొత్త రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌లోని నార్త్‌, సౌత్‌ ద్వీపాలను కలుపుతూ వెళ్లే కుక్‌ స్ట్రీట్‌ను అతను 8 గంటలా 37 నిమిషాల్లో ఈదాడు. దీంతో ఈ పోటీని పూర్తి చేసిన అతి తక్కువ వయసు గల తొలి ఆసియన్‌గా రికార్డులకెక్కాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా రోజులు వేచి చూసిన మోరె ఈనెల 9న ఎట్టకేలకు ఈతకు పూనుకున్నాడు. ఉషో?గ్రత 19 డిగ్రీల సెల్సియస్‌ ఉండటంతో తొలి ఐదు గంటలు ఈత సాఫీగా సాగింది. కానీ అంటార్కిటికా నుంచి వచ్చే ప్రవాహలతో ఉషో?గ్రత ఒక్కసారిగా 4 డిగ్రీలకు పడిపోయింది. దీంతో విపరీతమైన చలిలో వణుకుతూనే మిగతా పోటీని పూర్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీని పూర్తి చేసిన తొమ్మిదో వ్యక్తిగా మోరె రికార్డు స ష్టించాడు. 11 ఏండ్ల వయసులోనే మోరె తన తొలి మారథాన్‌ స్విమ్‌ను పూర్తి చేయడం గమనార్హం.