జ‌పాన్ ఓపెన్ నుంచి పివి సింధు ఔట్‌

జ‌పాన్ ఓపెన్ నుంచి పివి సింధు ఔట్‌

  భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పివి సింధు జ‌పాన్ ఓపెన్‌లో ఓడిపోయింది. చైనాకు చెందిన 14 సీడ్ గావో ఫంగ్జీతో జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ రెండో రౌండ్‌లో 18-21, 19-21 తేడాతో వ‌రుస సెట్ల‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. మ‌రో మ్యాచ్‌లో కిదాంబి శ్రీ‌కాంత్ హాంకాంగ్ ఆట‌గాడు వాంగ్ వింగ్‌కిని 21-15, 21-14 తేడాతో ఓడించి క్వార్ట‌ర్స్‌కు వెళ్ల‌గా...ఇంకో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ ఆంథోని సినిసుక చేతిలో ఓడి టోర్నీ నుంచి బ‌య‌ట‌కొచ్చాడు.