జాతీయ క్రీడా పరిశీలకుడి పదవికి సుశీల్ రాజీనామా 

 జాతీయ క్రీడా పరిశీలకుడి పదవికి సుశీల్ రాజీనామా 

 న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ క్రీడా పరిశీలకుడి పదవికి.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ బుధవారం రాజీనామా చేశాడు. రెజ్లర్‌గా ఉంటూ అధికార పదవిలో కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుండటంతో అతను ఈ పదవి నుంచి వైదొలిగాడు. వారం రోజుల కింద స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ కూడా బాక్సింగ్ పరిశీలకురాలి పదవికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీడల్లో పాల్గొంటున్న ఎవరైనా క్రీడా పరిశీలకుల పదవిలో కొనసాగకూడదనే నిబంధన ఉందని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. వాటిని క్రీడాశాఖ అనుమతించింది కూడా. పదవికి రాజీనామా చేసినందుకు క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.. సుశీల్‌కు ధన్యవాదాలు తెలిపారు.