మూడో రౌండ్‌కు సెరెనా, వీనస్‌

మూడో రౌండ్‌కు సెరెనా, వీనస్‌

  మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్‌కు అమెరికా నల్ల కలువ, బిడ్డతల్లి సెరెనా విలియమ్స్‌ దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో 16వ సీడ్‌ సెరెనా 6-2, 6-2 సెట్ల తేడాతో బౌచర్డ్‌(కెనడా)ను చిత్తుచేసింది. ఇతర పోటీల్లో వీనస్‌ 6-3, 4-6, 6-0తో కార్నెట్‌(ఫ్రాన్స్‌)ను, 4వ సీడ్‌ ఒసాకా 6-2, 6-4తో జిడన్‌సెక్‌(స్లొవేనియా)పై గెలుపొందారు. అమెరికాకు చెందిన కెయాస్‌, చైనాకు చెందిన వాంగ్‌, 13వ సీడ్‌ సెవస్టోవా, ఆరోసీడ్‌ స్విటొలినా రెండోరౌండ్‌ పోటీల్లో ప్రత్యర్ధులపై గెలిచారు. ఇక పురుషుల సింగిల్స్‌లో నాల్గోసీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ) 7-6(7-5), 6-4, 5-7, 6-7(6-8), 6-1తో క్యార్డీ(ఫ్రాన్స్‌)పై చెమటోడ్చి నెగ్గగా, టాప్‌సీడ్‌ జకోవిచ్‌ 6-3, 7-5, 6-4తో సొంగా(ఫ్రాన్స్‌)ను, 8వ సీడ్‌ నిషికోరి(కొరియా) 6-3, 7-6(8-6), 5-7, 5-7, 7-6(10-7)తో క్రొయేషియాకు చెందిన కర్లోవిక్‌లను ఓడించి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు.