నడి వీధిలో యూత్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం

నడి వీధిలో యూత్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం

  బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా) : 2018 యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలను సరికొత్తగా నిర్వహించారు. సుమారు 2 లక్షల మంది ప్రజలు చూస్తుండగా గేమ్స్‌ ప్రారంభ వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. బాణాసంచా, విద్యుత్‌ వెలుగులతో బ్యూనస్‌ ఎయిర్స్‌ వీధి పట్టపగలను తలపించింది. ప్రారంభోత్సవ వేడుకలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షులు థామస్‌ బాచ్‌ ప్రశంసించారు. ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి టీనేజ్‌ షూటింగ్‌ సంచలనం మను భకెర్‌ నేతృత్వం వహించింది. భారత పతకాన్ని ధరించి ముందు నడిచింది. ఈ గేమ్స్‌లో మొత్తంగా 206 దేశాలకు చెందిన బృందాలు పాల్గొంటున్నాయి. 32 క్రీడల్లో 241 ఆంశాల్లో ఈ పోటీల్లో నిర్వహించనున్నారు. ఈ 3వ యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ ఈ నెల 18 వరకూ జరగనున్నాయి. ఈ పోటీల్లో 68 మంది సభ్యులతో కూడిన భారత బృందం పాల్గుంటుంది. 13 క్రీడా విభాగాల్లో భారత్‌ పోటీ పడనుంది.