నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్

నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్

 సిడ్నీ : గ్రాండ్‌స్లామ్‌ తొలిటోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సోమవారంనుంచి ప్రారంభం కానుంది. టాప్‌సీడ్స్‌గా సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌, హెలెప్‌లు బరిలోకి దిగనున్నారు. జనవరి 26, 27న రోడ్‌లేవర్‌ ఎరేనాలో మహిళల, పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ పోటీలు ముగియనున్నాయి. ఈ ఏడాది టోర్నీ బరిలో 128మంది పురుష, మహిళా ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగనున్నారు. 104మంది ఆటగాళ్లు నేరుగా, మరో 24మంది టోర్నీ లీగ్‌ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధించారు. 

భారత్‌కు చెందిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలిసారి సింగిల్స్‌కు అర్హత సాధించి టోర్నీ బరిలోకి దిగనున్నాడు. మూడోసీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ 20వ గ్రాండ్‌స్లామ్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన జకో 7వ సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌పై కన్నేశాడు. రెండోసీడ్‌ రఫెల్‌ నాదల్‌, గత ఏడాది విజేత క్రొయేషియాకు చెందిన మారిన్‌ సిలిక్‌లు టైటిల్‌ ఫేవరేట్స్‌గా బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో వాజ్నియోంకీ, హెలెప్‌లు ఫైనల్‌కు చేరే అవకాశముంది.