నేటి నుంచి చైనా ఓపెన్‌ షురూ

నేటి నుంచి చైనా ఓపెన్‌ షురూ

  ఫుజో(చైనా) : ఈ ఏడాది నిరాశాజనక ఫలితాలతో ఆకట్టుకోలేకపోతున్న పివి సింధు చైనా బ్యాడ్మింటన్‌లో టైటిల్‌ సాధించడమే ధ్యేయంగా బరిలోకి దిగనుంది. మంగళవారంనుండి ప్రారంభం కానున్న చైనా ఓపెన్‌ తొలిరౌండ్‌లో రష్యాకు చెందిన ఎవ్‌జేనియాతో ముఖాముఖి తలపడనుంది. ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన సింధు ఈ ఏడాది ఐదు టోర్నీ ఫైనల్లోకి చేరినా చివర్లో బోల్తాపడుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానంలో కొనసాగుతున్న సింధు సెమీస్‌కు చేరితే జపాన్‌ షట్లర్‌ ఒకుహరాతో తలపడాల్సి ఉంటుంది. స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ సెమీస్‌కు చేరితో రెండోసీడ్‌ యమగుచి(జపాన్‌)తో పోటీపడుతుంది. సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు చెందిన మరో షట్లర్‌ వైష్ణవి రెడ్డి బుధవారం తొలిమ్యాచ్‌లో చోఛువాంగ్‌(థారులాండ్‌)తో తొలిరౌండ్‌లో పోటీపడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో ఐదోసీడ్‌ శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణరులు బుధవారం తొలిరౌండ్‌ పోటీలలో బరిలోకి దిగనున్నారు.