నిలువరించిన తెలుగు టైటాన్స్‌

నిలువరించిన తెలుగు టైటాన్స్‌

 నోయిడా : ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ అదరగొడుతోంది. మంగళవారం బలీయ యుపి యోధాను నిర్ణీత సమయానికి 26-26 పాయింట్లతో సమంగా నిలిచి మ్యాచ్‌ను 'టై'గా ముగిచింది.తెలుగు టైటాన్స్‌ తరఫున రైడ్స్‌లో మోసేన్‌, అబోజర్‌, సోలంకీలు రాణించగా... యోధా జట్టులో సచిన్‌, జాదవ్‌, దేవడిగాలు రాణించారు. ఇరుజట్లు ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. రైడ్స్‌లో తెలుగు టైటాన్స్‌ 13, యుపి 11 పాయింట్లును సాధించారు. ట్యాకిల్స్‌లో టైటాన్స్‌ 11, యుపి 13 పాయింట్లతో రాణించారు. మొత్తమ్మీద టైటాన్స్‌-యుపి జట్లు రెండేసిసార్లు ఆలౌట్‌కూడా అయ్యాయి. అంతకుముందు జైపూర్‌ పింక్‌ప్యాంథర్స్‌-హర్యానా స్టీలర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 38-32 పాయింట్ల తేడాతో స్టీలర్స్‌ను ఓడించింది. జైపూర్‌ తరఫున దీపక్‌ హుడా 12 రైడ్‌ పాయింట్లతో అదరగొట్టాడు. స్టీలర్స్‌ తరఫున హండోలా 10 పాయింట్లు సాధించాడు.