పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సైనా

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సైనా

  హైదరాబాద్‌: డిసెంబరులో బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌-కశ్యప్‌ల వివాహం జరగనుందన్న వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానిపై సైనా సోమవారం క్లారిటీ ఇచ్చారు. ఆమె సహచర బ్యాడ్మిం టన్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను డిసెంబరు 16న ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు. 2005 నుంచి బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకొంటున్న సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని, అయితే కెరీర్‌ కోసం తాము వివాహాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశామన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో కొనసాగుతున్న పారుపల్లి కశ్యప్‌తో 11వ స్థానంలో సైనా పెళ్ళి జరగనుంది. ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌లో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకాన్ని గెల్చిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్‌ 16నే వివాహం చేసుకోవడం వెనక ఓ కారణం ఉందని, డిసెంబర్‌ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ ఉంటాయి. అందుకే ఆ తేదీని నిర్ణయించినట్లు సైనా వివరించారు.