పోరాడి ఓడిన అర్చన

పోరాడి ఓడిన అర్చన

  బ్యూయోనస్‌ ఎరేస్‌ (అర్జెంటీనా) : యూత్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన అర్చన కమత్‌ ఓటమిపాలైంది. చైనాకు చెందిన యన్‌షా సన్‌ చేతిలో 1-4 సెట్ల తేడాతో ఓటమిపాలై అర్చన కాంస్య పతకానికే పరిమితమైంది. 18 ఏళ్ళ కర్ణాటకు చెందిన అర్చన ఆర్చరీలో కాంస్య గెలవడం గమనార్హం. క్వార్టర్స్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన నింగ్‌ జింగ్‌పై 4-3 సెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకొచ్చింది. జింగ్‌పై 13-11, 8-11, 6-11, 11-3, 6-11, 12-10, 11-7 హోరాహోరీ పోరులో గెల్చింది.