పోరాడి ఓడిన ఫెదరర్‌

పోరాడి ఓడిన ఫెదరర్‌

 లండన్‌ : వింబుల్డన్‌ టోర్నీలో పెనుసంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు, స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్‌ ఫెదరర్‌ సుదీర్ఘ పోరాటంలో ఓటమిపాలయ్యాడు. ఎనిమిదిసార్లు వింబుల్డన్‌ విజేత ఫెదరర్‌ దక్షిణాప్రికాకు చెందిన కెవిన్‌ అండర్సన్‌ చేతిలో 6-2, 7-6(7-5), 5-7, 4-6, 11-13 సెట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఫెదరర్‌ 16 ఏస్‌లను ప్రయోగించగా... అండర్సన్‌ 28 ఏస్‌లను సంధించాడు. ఐదో సెట్‌లో 11-11తో సమంగా ఉన్న దశలో అండర్సన్‌ ఫెదరర్‌పై బ్రేక్‌పాయింట్‌ సాధించి 13-11తో సెట్‌ను గెలుచుకోవడంతోపాటు మ్యాచ్‌ను కూడా ముగించడం విశేషం. మరో మ్యాచ్‌లో 12వ సీడ్‌ సెర్బియాకు చెందిన జకోవిచ్‌ 6-3, 3-6, 6-2, 6-2 సెట్ల తేడాతో 24వ సీడ్‌ జపాన్‌కు చెందిన నిషికోరిపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.