ప్రి క్వార్టర్స్‌కు ఇరాన్‌ జట్టు

ప్రి క్వార్టర్స్‌కు ఇరాన్‌ జట్టు

 అబుదాబి : ఆసియాకప్‌(ఎఎఫ్‌సి) ఫుట్‌బాల్‌ టోర్నీ నాకౌట్‌లోకి ఇరాన్‌ జట్టు ప్రవేశించింది. శనివారం వియత్నాం జట్టును 2-0 గోల్స్‌ తేడాతో ఓడించింది. ఇరాన్‌ తరఫున సర్దార్‌ అజ్‌మౌన్‌ రెండు గోల్స్‌ చేసి ఆ జట్టును ప్రీ క్వార్టర్స్‌కు చేర్చాడు. దీంతో ఆ జట్టు 43 ఏళ్ల తర్వాత టైటిల్‌ వేటలో నిలిచినట్లైంది. మరోమ్యాచ్‌లో ఇరాక్‌ 3-0తో యెమెన్‌పై గెలిచింది. భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆఖరి లీగ్‌మ్యాచ్‌ను బహ్రెయిన్‌తో సోమ వారం తలపడనుంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా భారతజట్టు నాకౌట్‌కు చేరడం ఖాయం.