పురుషుల హాకీ నూతన కోచ్‌గా హరేంద్రసింగ్‌

పురుషుల హాకీ నూతన కోచ్‌గా హరేంద్రసింగ్‌

 ఢిల్లీ : భారత పురుషుల హాకీ జట్టుకు నూతన కోచ్‌గా హరేంద్రసింగ్‌ ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ పోటీల్లో మహిళల హాకీ జట్టు హరేంద్ర శిక్షణలో ఎక్కువ విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆయనకు ఈ పదవి దక్కింది. హరేంద్ర 2009 నుండి 2011 వరకు పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. మరోవైపు పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా ఉన్న మారిజ్నెను తిరిగి మహిళల జట్టుకు పంపారు. ఈయన శిక్షణలో ఉన్న పురుషుల హాకీ జట్టు గత నెలలో జరిగిన గోల్డ్‌కోస్ట్‌ పోటీల్లో పేలవ ప్రదర్శన చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత భారత పురుషుల జట్టు తొలిసారిగా పతకం లేకుండా స్వదేశానికి తిరిగి వచ్చింది. దీంతో ఆయనను మహిళల హాకీ జట్టుకు నియమించారు.