క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

 కౌలాలంపూర్‌ (మలేసియా): భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌లు మలే సియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌ మ్యాచ్‌లో కిదాంబి 23-21, 8-21, 21-18 పాయింట్ల తేడాతో వింగ్‌-కి- విన్సెంట్‌(హాంకాంగ్‌)పై, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ 21-14, 21-16 తేడాతో యిప్‌ పురు యిన్‌(హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు. పారుపల్లి కశ్యప్‌ 17-21, 23-25 పాయింట్ల తేడాతో విక్టర్‌ అక్సెల్సన్‌ చేతిలో వరుససెట్లలో ఓడాడు. మహిళల డబుల్స్‌ లో పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 18-21, 17-21 పాయింట్ల తేడాతో ఇండోనేషియా జోడీ చేతిలో ఓడింది. కెంటో మొమోటోపై గెల్చిన నిషిమోటో రెండోరౌండ్‌లో 15-21, 17-21 పాయింట్ల తేడాతో లీ-జి(మలేషియా) చేతిలో ఓడాడు. శుక్రవారం శ్రీకాంత్‌ మాజీ ఛాంపియన్‌ హో-సన్‌ (కొరియా)తోనూ, సైనా నెహ్వాల్‌ ఒకుహారా (జపాన్‌)తోనూ క్వార్టర్‌ఫైనల్లో తలపడనున్నారు.