రెండో రౌండ్‌కు పివి సింధు

రెండో రౌండ్‌కు పివి సింధు

  ఫుజో: చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌లోకి భారత షట్లర్‌ పివి సింధు ప్రవేశించింది. మంగళవారంనుండి ప్రారంభమైన టోర్నీ తొలిరౌండ్‌ మ్యాచ్‌లో సింధు 21-13, 21-19 పాయింట్ల తేడాతో ఎవ్‌జేనియా (రష్యా)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం. తొలిగేమ్‌ ప్రారంభంలో ఎవ్‌జేనియా 7-5 పాయింట్ల ఆధిక్యతలో నిల్చినా అనంతరం సింధు విజృంభించడంతో 14-8కు... చివరకు తొలిసెట్‌ను 21-13తో సింధు ముగిచింది. 23 ఏళ్ళ సింధుకు రెండోసెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురై సింధు ఓ దశలో 10-7 పాయింట్లలో నిల్చినా... రష్యా షట్లర్‌ పుంజుకోవడంత ఆ గేమ్‌ 15-15 పాయింట్లతో సమ మైంది. ఆ క్రమంలో ఇరువురు షట్లర్లు 19-19 పాయింట్లతో చేరిన క్రమంలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధిం చి మ్యాచ్‌ను సొంతం చేసు కుంది. రెండో రౌండ్‌లో సింధు థారులాండ్‌కు చెందిన బుసానన్‌తో తలపడనుంది. మహిళల డబుల్స్‌ జోడీ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప తొలిరౌండ్‌లోనే ఓడగా.. పురుషుల డబుల్స్‌ జోడీ మను అత్రి-సుమీత్‌ రెడ్డిలు 16-21, 25-27 పాయింట్ల తేడాతో ఆరోసీడ్‌ డెన్మార్క్‌ జోడీ కిమ్‌ అస్ట్రప్‌-అండర్స్‌ చేతిలో ఓడారు.