రోజర్స్‌ కప్‌కూ సెరెనా దూరం

రోజర్స్‌ కప్‌కూ సెరెనా దూరం

  లాస్‌ఏంజిల్స్‌: కెనడాలోని టొరంటోలో సోమవారం నుండి ప్రారంభమైన రోజర్స్‌ కప్‌కూ అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ దూరమయ్యారు. ఇటీవల జరిగిన వింబుల్డన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, టోర్నమెంట్లలో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. సొంతదేశం అమెరికాలో జూలై 31న జరిగిన చరిత్రత్మక శాన్‌జోస్‌ సిలికాన్‌ వ్యాలీ క్లాసిక్‌ టోర్నీలో సైతం ఓటమి చవిచూశారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్‌ ఒలంపియా ఒహానియన్‌ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరెనా సరిగా ఆడలేపోయింది. అమ్మ అయిన తర్వాత ఆటలో వెనకబడడంతో ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిపై ఆమె స్పందించారు. తాను ప్రసవానంతర ఉద్వేగాలతో సతమతమవుతున్నానని తెలిపారు. కొన్ని సార్లు తన కూతురుతో కొద్ది సమయం కూడా గడపలేక పోవడం బాధిస్తోందని అన్నారు. తనను విమర్శిస్తున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనీ, బిడ్డకు జన్మనిచ్చిన వారెవరైనా మళ్లీ మాములు జీవనం సాగించడం అంత సులువు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.