రష్యా బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణం

రష్యా బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణం

 న్యూఢిల్లీ: రష్యాలోని కాస్పిస్క్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఉమఖ్నౌ మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో హర్యానాకు చెందిన సావీటి బూరా స్వర్ణం పతకం గెలిచుకుంది. గతంలో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేతగా నిలిచిన సావీటి 75కిలోల విభాగంలో స్థానిక ఛాంపియన్‌ అన్నా అన్ఫినోగెనోవాపై అద్భుత విజయం సాధించింది. అయితే ఈ టోర్నమెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్న ఏకైక ఇండియన్‌ సావీటి మాత్రమే. పురుషుల బాక్సింగ్‌లో బ్రిజేశ్‌ యాదవ్‌(81కిలోలు), వీరేందర్‌ కుమార్‌(91కిలోల) మ్యాచుల్లో రజత పతకంతోనే సరిపెట్టుకున్నారు.

యాదవ్‌ రష్యాకు చెందిన మురద్‌ రబదనౌతో ఓడిపోగా.. కుమార్‌ స్వీడెన్‌కి చెందిన అలెగ్జాండర్‌ వాల్బల్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ సందర్భంగా స్వర్ణం గెలుచుకున్న సావీటిపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.