సానియా మీర్జా మోకాలికి గాయం

సానియా మీర్జా మోకాలికి గాయం

 ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మోకాలి గాయానికి గురైంది. ఈ కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడింది. మోకాలి గాయంతో బాధపడుతున్నాను. శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న దానిపై తర్వలో నిర్ణయానికి రావాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ యేడాదిని టాప్-10 ర్యాంకింగ్స్‌కు దగ్గరగా ముగించడం సంతోషంగా ఉంది అని సానియా అంది.