సెమీస్‌కు సెరెనా, ఓస్టాపెంకో

సెమీస్‌కు సెరెనా, ఓస్టాపెంకో

 లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి సెరెనా విలియమ్స్‌, ఓస్టాపెంకో, కెర్బర్‌, జోర్జెస్‌ ప్రవేశించారు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లలో 25వ సీడ్‌ సెరెనా విలియమ్స్‌(అమెరికా) 3-6, 6-3, 6-4 సెట్ల తేడాతో జియోర్జి(ఇటలీ)ని ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్ళారు. 12వ సీడ్‌ ఓస్టాపెంకో(లాత్వియా) 7-5, 6-4 సెట్ల తేడా సిబుల్కోవా (స్లొవేకియా) పైనా 11వ సీడ్‌ కెర్బర్‌(జర్మనీ) 6-3, 7-5 సెట్ల తేడాతో 14వ సీడ్‌ రష్యాకు చెందిన కసట్కినాపై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌లలో 13వ సీడ్‌ జోర్జెస్‌(జర్మనీ) 3-6, 7-5, 6-1 సెట్ల తేడాతో 20వ సీడ్‌ బెర్టెన్స్‌(నెదర్లాండ్‌)పై చెమటోడ్చి గెలిచారు.