సెమీస్‌లో గ్రీకు వీరుడు

సెమీస్‌లో గ్రీకు వీరుడు

  మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్‌ ఫెదరర్‌ను ఓడించిన గ్రీస్‌ వీరుడు, పధ్నాలుగో సీడ్‌ సిట్సిపస్‌ మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో 22వ సీడ్‌ బటిస్టా అగస్టా(స్పెయిన్‌)ను ఇంటికి పంపించాడు. మూడు గంటల 15 నిముషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సిట్సిపస్‌ గెలిచి సెమీస్‌కు చేరాడు. ఈ 20 ఏళ్ల యువ గ్రీకు వీరుడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించే దశగా పోరాటం కానసాగిస్తున్నాడు. 

క్వార్టర్స్‌లో బటిస్టా అగస్ట్‌పై 7-5, 4-6, 6-4, 7-6(7-2)తేడాతో చెమటోడ్చి నెగ్గాడు. మొదటిసెట్‌లో ఆధిక్యం సాధించిన సిట్సిపస్‌ రెండో సెట్‌లో 4-6లో వెనుకంజ వేశాడు. అయితే మూడు, నాలుగు సెట్లలో ఆధిపత్యం సాధించాడు. 22 ఏస్‌లతో సహా నాలుగు బ్రేకింగ్‌ పాయింట్ల సాయంతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. గురువారం రెండోసీడ్‌ స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌తో సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ నాదల్‌ 6-3, 6-4, 6-2తో అమెరికా యువ ఆటగాడు ప్రాన్సిస్‌ టిఫారుపై గెలిచాడు. గంటా 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను నాదల్‌ వరుస మూడు సెట్లలోనే ముగించడం విశేషం. 

ఇక మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-1, 6-4 తేడాతో బార్టీ(ఆస్ట్రేలియా)ని వరుస సెట్‌లలో ఓడించింది. మొదటినుంచి ముందజలో వున్న క్విటోవా మూడు ఏస్‌లు, మూడు బ్రెక్‌ పాయింట్లు సాధించడం విశేషం. మరో మ్యాచ్‌లో కోలిన్స్‌(అమెరికా) 2-6, 7-5, 6-2 తేడాతో పౌలీఛెన్కోవా(రష్యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో క్విటోవా అమెరికాకు చెందిన కోలిన్స్‌తో ఫైనల్‌ బెర్తు కోసం గురువారం తలపడనుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లో భారత్‌-ఆస్ట్రియా జోడీ లియాండర్‌ పేస్‌-స్టోసర్‌ 6-4, 4-6, 8-10 హోరాహోరీ పోరులో ఫరాV్‌ా-గ్రోనిఫెల్డ్‌ చేతిలో ఓడి నిరాశపరిచాడు.