సిరీస్ విజేత భారత్

సిరీస్ విజేత భారత్

  సియోల్: ఆల్‌రౌండ్ నైపుణ్యం..అంతకు మించిన పట్టుదల..ప్రత్యర్థి మనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నా భారత మహిళల హాకీజట్టు అదురగొట్టింది. పటిష్ఠమైన కొరియా అమ్మాయిలతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన నాలుగోమ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో భారత మహిళ జట్టు ..కొరియా అమ్మాయిలను చిత్తు చేశారు. గుర్జిత్ కౌర్ మ్యాచ్ రెండో నిమిషంలో , దీపిక 14వ నిమిషంలో గోల్ కొట్టగా.. మ్యాచ్ 47వ నిమిషంలో భారత ఫార్వర్డ్ పూనమ్ రాణి అద్భుత ఫీల్డ్‌గోల్‌తో విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్ ఆఖరి క్వార్టర్‌లో దక్షిణ కొరియా అమ్మాయి మి హైయున్ పార్క్ ఏకైక గోల్ కొట్టింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో విజయంతో ఊపు మీదున్న మన అమ్మాయిల జట్టు అదే ఊపులో కొరియాను కూడా చిత్తు చేసి కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది.