తమిళ్‌కు హ్యాట్రిక్‌ ఓటమి

 తమిళ్‌కు హ్యాట్రిక్‌ ఓటమి

   చెన్నై : ప్రొ కబడ్డీలో యు ముంబా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జైపూర్‌ పింక్‌ ప్యాంథర్స్‌పై 39-32 పాయింట్ల తేడాతో గెలుపొందింది. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి పోరులో యు ముంబా అనూహ్యంగా పింక్‌ ప్యాంథర్స్‌పై గెలిచింది. జైపూర్‌ పింక్‌ప్యాంథర్స్‌ కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌ సారథ్యంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు చివర్లో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు జైపూర్‌ ఫ్రాంచేజీ యాజమాని అభిషేక్‌ బచ్చన్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. చివరి నాలుగు నిమిషాల వరకూ ఇరుజట్లు 29-30 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఆ సమయంలో యు ముంబా ఆటగాడు సిద్దార్థ దేశారు రెండు పాయింట్లు సంపాదించి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత పాయింట్లు దక్కించుకోవడంలో జైపూర్‌ వెనుకబడగా... యు ముంబా ఆటగాళ్లు చివర్లో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించుకున్నాడు. తమిళ్‌ తలైవాస్‌-బెంగళూరు బుల్స్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 48-37 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది.