తెలుగు టైటాన్స్ గెలుపు

తెలుగు టైటాన్స్ గెలుపు

  చెన్నై : ప్రొ కబడ్డీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్‌ ఆడుతున్న టైటాన్‌ జట్టు 33-28 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే టైటాన్‌ ప్రత్యర్ధి జట్టుపై 18-11 పాయింట్ల ఆధిక్యతను సంపాదించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ చౌదరి సక్సెస్‌ఫుల్‌ రైడ్‌లతో సత్తా చాటగా... మొహసేన్‌ డిఫెండర్‌గా రాణించి టైటాన్స్‌కు పాయింట్లను తెచ్చారు. మంజీత్‌ ఛిల్లార్‌, అజరు ఠాకూర్‌లు తమిళ్‌ తలైవాస్‌కు పాయింట్లను సాధించారు. తమిళ్‌ స్టార్‌ ఆటగాడు జస్వీర్‌ సింగ్‌ ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆట చివరి ఐదు నిమిషాల వరకు టైటాన్స్‌ 26-21 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. చివరి మూడు నిమిషాల టైమ్‌ ఔట్‌ సమయానికి టైటాన్స్‌ నాలుగు పాయింట్ల ఆధిక్యతలో నిల్చింది. తమిళ్‌ తలైవాస్‌ తరఫున అమిత్‌ హుడా ఆరు సూపర్‌ ట్యాకిల్‌ పాయింట్లను సాధించాడు.