యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌

యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌

  బ్యూనస్‌ఎయిర్స్‌ : అర్జెంటీనాలో జరుగుతున్న యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ సోమవారం రెండు పతకాలతో అదరగొట్టింది. మహిళల జూడో, షూటింగ్‌ విభాగాల్లో భారత్‌కు రెండు రజిత పతకాలు దక్కాయి. పురుషుల 10మీ. షూటింగ్‌ విభాగంలో తుషార్‌ మానే ఫైనల్లో 247.5 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో గ్రిగొర్రి షమకోవ్‌(249.2 పాయింట్లు)కు స్వర్ణం గెల్చుకోగా... సెర్బియాకు చెందిన అలెక్సా మిట్రోవిక్‌(227.9 పాయింట్లు)కు కాంస్య పతకాలు దక్కాయి. మహిళల జూడో 44 కిలోల కేటగిరీలో తబాబిదేవి తంగ్జమ్‌ రజితపతకాన్ని గెల్చింది. సెమీస్‌లో క్రొయేషియాకు చెందిన అనా విక్టోరిజాను 10-0 పాయింట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించినా... ఫైనల్లో ఓటమిపాలవ్వడంతో రజిత పతకానికే పరిమితమైంది. ఇతర పోటీల్లో పురుషుల హాకీ(5 కాంపిటీషన్‌)లో భారత్‌ బంగ్లాదేశ్‌ను 10-0 గోల్స్‌తో ఓడించింది.