యుకీ సంచలన విజయం

యుకీ సంచలన విజయం

  ఇండియానా వెల్స్: భారత సింగిల్స్ స్టార్ ఆటగాడు యుకీ బాంబ్రి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయం నమోదు చేసాడు. ఇండియా నా వెల్స్ ఏటీపీ టోర్నీలో ప్రపంచ నంబర్ 12 ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ పోయిల్లేను ఓడించి సంచలన విజయంతో మూడోరౌండ్ చేరుకున్నాడు. సోమవారం జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో 6-4,6-4 స్కోరుతో గంట 19 నిమిషాల్లో వరుస సెట్లలో తనకన్నా ఎన్నోరెట్లు మెరుగైన లూకాస్‌ను బాంబ్రి చిత్తు చేసి అబ్బురపరిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బాంబ్రి ప్రస్తుతం 110వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా, యుకీ మూడోరౌండ్‌లో అమెరికా స్టార్ ప్రపంచ 21వ ర్యాంకర్ శామ్ కెర్రీతో తలపడనున్నాడు.