1,999కే ఐవూమీ ఫిట్‌నెస్ బ్యాండ్

1,999కే ఐవూమీ ఫిట్‌నెస్ బ్యాండ్

 చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఐవూమీ తన నూతన ఫిట్‌నెస్ బ్యాండ్ 'ఫిట్‌మి' ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల యూజర్ చుట్టూ ఉన్న పరిసరాల్లోని గాలి నాణ్యత ఏ విధంగా ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ బ్యాండ్ ద్వారా వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు వీలు కల్పించారు. ఇందులో ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 0.87 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, పెడోమీటర్, బ్లూటూత్ 4.2, 90 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు డివైస్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక ఈ బ్యాండ్ కేవలం ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో మాత్రమే రూ.1,999 ధరకు లభిస్తున్నది.