9వేలు త‌గ్గిన ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌

9వేలు త‌గ్గిన ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌

 ఎల్‌జీ త‌న జీ6 స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది మార్చి నెల‌లో విడుద‌ల చేసిన విష‌యం విదితమే. కాగా ఈ ఫోన్ విడుద‌లైన‌ప్పుడు రూ.51,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భించింది. అయితే ఈ ఫోన్ ధర క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. ఇందులో భాగంగానే తాజాగా ఎల్‌జీ జీ6 ధ‌ర ఏకంగా రూ.9వేల వ‌ర‌కు త‌గ్గింది. దీంతో ఈ ఫోన్‌ను ప్ర‌స్తుతం రూ.37,990 ధ‌ర‌కే యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. 

ఎల్‌జీ జీ6 ఫీచ‌ర్లు...
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, 1440 x 2880 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.