ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం జియో ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌..!

ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం జియో ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌..!

  టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త‌గా జియో బ్రౌజ‌ర్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. చాలా త‌క్కువ సైజ్ ఉండ‌డ‌మే గాక బ్రౌజ‌ర్ వేగంగా ప‌నిచేస్తుంద‌ని జియో చెబుతున్న‌ది. ఇక ఇందులో 8 భార‌తీయ భాష‌ల‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. వినియోగ‌దారులు బ్రౌజ‌ర్‌లో త‌మ లోక‌ల్ లాంగ్వేజ్‌ను సెట్ చేసుకుంటే బ్రౌజ‌ర్ హోమ్ పేజీలో ఆ భాష‌కు చెందిన వార్త‌లు క‌నిపిస్తాయి. ఇక ఇతర బ్రౌజ‌ర్ల‌లాగే ఇందులోనూ ట్యాబ్డ్ బ్రౌజింగ్‌, ఇన్‌క‌గ్నిటో మోడ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. కాగా జియో బ్రౌజ‌ర్ యాప్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో ల‌భిస్తున్న‌ది. కేవ‌లం 4.8 ఎంబీ సైజ్‌ను మాత్ర‌మే ఈ యాప్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆ పైన ఓఎస్ వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌లో మాత్ర‌మే ఈ బ్రౌజ‌ర్ ప‌నిచేస్తుంది.