కంప్యూటర్ ద్వారా ఫోన్ మాట్లాడొచ్చు..!

కంప్యూటర్ ద్వారా ఫోన్ మాట్లాడొచ్చు..!

 కంప్యూటర్‌తో పనిచేసే ఉద్యోగులకు తమ ఫోన్‌లకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లు చూడడం, మాట్లాడడం కొన్నిసార్లు కుదరదు. దీనివల్ల ముఖ్యమైన విషయాలు, కాల్స్‌ని రిసీవ్ చేసుకోలేక పోతారు. ఈ యాప్‌తో కంప్యూటర్ లోనే ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని రిసీవ్ చేసుకోవచ్చు.


ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో రిమోట్ ఫోన్‌కాల్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

-అదే విధంగా కంప్యూటర్‌లో కాల్‌సెంటర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 

-ఫోన్‌లో రిమోట్ యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే డివైజ్ ఐపీ అడ్రస్, పాస్‌వర్డ్ కనిపిస్తాయి.

-కంప్యూటర్‌లోని కాల్‌సెంటర్ యాప్‌లోకి వెళ్లి యాడ్ వైఫై డివైస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను కూడా ఎంటర్ చేయాలి.

-ప్రాసెస్ పూర్తయిన వెంటనే నెట్‌వర్క్‌కు సంబంధించిన నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఈ కోడ్‌ను విండోస్ టూల్‌లో ఎంటర్ చేస్తే మీ ఫోన్ పీసీకి కనెక్ట్ అవుతుంది.

-విండోస్ పీసీ కాల్ సెంటర్‌ను సెట్ చేసుకోవడం ద్వారా మీ కంప్యూటర్ నుంచే ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను పంపే వీలుంది. ఈ అనుసంధానంతో ఫోన్ కాల్‌లాగ్స్ పీసీలో సింక్ అవుతాయి.

-ఈ యాప్ ద్వారా ఫోన్‌లోని అన్ని కాంటాక్ట్స్ కంప్యూటర్‌లో కనిపిస్తాయి. కాల్స్ చేసుకోవచ్చు, వచ్చిన కాల్స్‌ని మాట్లాడొచ్చు. ఎస్‌ఎంఎస్‌లను చదువొచ్చు, కాంటాక్ట్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు.

-క్లిప్ బోర్డ్ నుంచి డయలింగ్ నంబర్స్, ఇన్‌కమింగ్ కాల్స్ యాక్టివేట్ చేసేందుకు ప్రత్యేకమైన హాట్ కీని సెట్ చేసుకోవచ్చు.