ఈ టీవీని ప‌రుపులా చుట్ట‌వ‌చ్చు..!

ఈ టీవీని ప‌రుపులా చుట్ట‌వ‌చ్చు..!

  ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ కంపెనీ ఎల్‌జీ ప‌రుపులా చుట్టగ‌లిగే ఓ నూత‌న ఓలెడ్ టీవీని ఇవాళ విడుద‌ల చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో భాగంగా నిర్వ‌హించిన ఈవెంట్‌లో ఎల్‌జీ ఈ టీవీని లాంచ్ చేసింది. సిగ్నేచ‌ర్ ఓలెడ్ టీవీ ఆర్ పేరిట విడుద‌లైన ఈ టీవీ తెర సైజ్ 65 ఇంచులు. దీన్ని వినియోగ‌దారులు ప‌రుపులా చుట్ట‌వ‌చ్చు. కాక‌పోతే అందుకు రిమోట్ లేదా టీవీపై ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. 

దీంతో ఆ టీవీ దాని కింద ఉండే బాక్స్‌లోకి రోల్ అవుతుంది. ఎల్‌జీ కంపెనీ దీన్ని రోల‌బుల్ ఓలెడ్ టీవీగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఈ టీవీలో వీక్ష‌కుల‌కు మూడు ర‌కాలైన వ్యూయింగ్ ఆప్ష‌న్లు ల‌భిస్తున్నాయి. ఫుల్ వ్యూ, లైన్ వ్యూ, జీరో వ్యూల‌లో టీవీని వీక్షించ‌వ‌చ్చు. ఇక ఇందులో అమెజాన్ అలెక్సా, యాపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్ కిట్‌ల‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే 4.2 చాన‌ల్ డాల్బీ అట్మోస్ ఆడియో సిస్ట‌మ్‌ను కూడా ఈ టీవీకి క‌నెక్ట్ చేసుకుని అత్యంత నాణ్య‌మైన సౌండ్ అవుట్‌పుట్‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఈ టీవీ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.