ఇక గ్రూప్ మెంబ‌ర్స్ లిమిట్ 2 ల‌క్ష‌లు..!

 ఇక గ్రూప్ మెంబ‌ర్స్ లిమిట్ 2 ల‌క్ష‌లు..!

 సోష‌ల్ మీడియా యాప్ టెలిగ్రాం త‌న యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై ఈ యాప్‌లో గ్రూప్ మెంబ‌ర్ల లిమిట్ 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇవ్వ‌నున్నారు. అలాగే గ్రూప్ అడ్మిన్ల‌కు ప‌లు అద‌న‌పు ప‌వ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. గ్రూప్ అడ్మిన్లు గ్రూప్‌లో ఉండే మెంబ‌ర్ల‌ను నిర్దిష్ట‌మైన కంటెంట్ పెట్ట‌కుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే మెసేజ్‌ల‌ను ఒక‌రికొక‌రు పంపుకోకుండా కూడా అడ్డుకోవ‌చ్చు. 

దీంతోపాటు అన్ని గ్రూప్‌ల‌ను ఇక‌పై గ్రూప్‌లుగానే వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంటే సూప‌ర్ గ్రూప్స్‌, బేసిక్ గ్రూప్స్ అన్నీ గ్రూప్స్‌గానే వ్య‌వ‌హ‌రింప‌బ‌డుతాయ‌న్న‌మాట‌. ఇక టెలిగ్రాం యాప్‌లో యూజ‌ర్ చాట్ లేదా క్లియ‌ర్ చాట్ హిస్ట‌రీని డిలీట్ చేస్తే క‌న్ఫ‌ర్మేష‌న్ డైలాగ్ ఆప్ష‌న్ వ‌స్తుంది. ఆ త‌రువాత 5 సెక‌న్ల లోపు యాక్ష‌న్‌ను అన్‌డు చేసుకునే స‌దుపాయం కూడా క‌ల్పించ‌నున్నారు. టెలిగ్రాం యాప్‌లో ఇక‌పై యూజ‌ర్లు త‌మ కాంటాక్ట్‌ల‌ను పేర్లు, లాస్ట్ సీన్ టైం ఆధారంగా సార్ట్ చేసుకోవ‌చ్చు. కొత్త‌గా రానున్న ఈ ఫీచ‌ర్ల‌న్నీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫాంల‌పై యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానున్నాయి.