హైడ్రా ఎక్స్ట్రీం పేరిట జాప్ కంపెనీ ఓ నూతన బ్లూటూత్ స్పీకర్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో వాటర్‌ప్రూఫ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే షాక్, డస్ట్, స్నో రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ డివైస్‌లకు ఈ బ్లూటూత్ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీంతో 8 గంటల వరకు నాన్‌స్టాప్ గా ఈ స్పీకర్ పనిచేస్తుంది. ఈ స్పీకర్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే కాల్స్‌ను యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయవచ్చు. అలాగే సాంగ్స్ ట్రాక్స్ మార్చవచ్చు. వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్ స్పీకర్లో బిల్టిన్ మైక్రోఫోన్‌ను అందిస్తున్నారు. 12 వాట్లు, 250 ఎంఎం డ్రైవర్ ఉండడం వల్ల ఈ స్పీకర్ నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్ ఇస్తుంది. రూ.3,299 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.