>

ఫేస్‌బుక్‌కు ‘టాటా’

ఫేస్‌బుక్‌కు ‘టాటా’

   ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ఖాతాదారులను కలిగివున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ కు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఫేస్‌ బుక్‌ ను వాడుతున్న యూత్‌ నెమ్మదిగా ముఖం చాటేస్తున్నారు. కొత్తగా వచ్చిన స్నాప్‌ చాట్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ లను ఆశ్రయిస్తున్నారు. యువ ఖాతాదారులు (25 ఏళ్లలోపు వారు) వైదొలగుతుండగా, పెద్దలు మాత్రమే మిగులుతున్నట్టు ఓ ఆన్‌ లైన్‌ సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల వయసువారిలో 5.8శాతం మంది ఫేస్‌ బుక్‌ ను వదిలేశారని 'ఇ-మార్కెటర్‌' రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా అమెరికాలో ఫేస్‌ బుక్‌ ను ఈ సమస్య బాధిస్తోందని తెలిపింది.