ఫేస్‌బుక్‌లో పెను మార్పులు

ఫేస్‌బుక్‌లో పెను మార్పులు

  న్యూయార్క్‌ : ఫేస్‌బుక్‌లో సమాచారాన్ని ఇచ్చే పద్ధతిలో ప్రధానమైన మార్పులు చేయాలని ఫేస్‌బుక్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, బ్రాండ్లకు, మీడియాకు సంబంధించిన సమాచారానికి తక్కువ ప్రాధాన్యత వుండేలా చూసేందుకు చర్యలు తీసుకోనున్నారు. దానికి బదులుగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సంభాషణ జరిగేందుకు అవకాశముండే సమాచారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపారు. ఫలితంగా ఫేస్‌బుక్‌లో వుండే వాణిజ్య సంస్థల పోస్టులకు ప్రజాదరణ తగ్గవచ్చని పేర్కొన్నారు. ఈ మార్పులు రాబోయే వారాల్లో అమల్లోకి వస్తాయి. ప్రజల మంచి చెడులు చూసేందుకు, వారి సంక్షేమం కోసం ఫేస్‌బుక్‌ పని చేస్తుందని చెప్పాల్సిన బాధ్యత తమపై వుందని తాను, తన బృందం అభిప్రాయపడినట్లు జుకర్‌బర్గ్‌ చెప్పారు.