గూగుల్‌కు  136 కోట్ల జరిమాన వేసిన భారత్‌

గూగుల్‌కు  136 కోట్ల జరిమాన వేసిన భారత్‌

 న్యూఢిల్లీ : ప్రఖ్యాత సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌కు భారత్‌ భారీ జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్‌ ప్రవర్తించినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పేర్కొంది.గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్‌ కంపెనీ వెబ్‌సెర్చ్‌లో, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పైచేయి సాధించేందుకు యత్నించినట్లు తెలిపింది. దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని చెప్పింది. ఈ మేరకు గూగుల్‌కు రూ. 136 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్‌ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది.