హానర్ 7సి స్మార్ట్‌ఫోన్ విడుదల

హానర్ 7సి స్మార్ట్‌ఫోన్ విడుదల

  హువావే సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 7సి' ని ఇవాళ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో లభ్యం కానుంది. త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.9,235, రూ.13,345 ధరలకు వినియోగదారులకు లభించనుంది. ఇందులో 5.99 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫుల్‌వ్యూ ఫీచర్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఇచ్చారు. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్‌గా ఓ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. 

హానర్ 7సి ఫీచర్లు...
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.