జియోఫోన్‌లో వాట్సాప్ వచ్చేసింది!

జియోఫోన్‌లో వాట్సాప్ వచ్చేసింది!

  జియోఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గత నెల 15 నుంచే వాట్సాప్, యూట్యూబ్‌ యాప్‌లని అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ, తాజాగా దేశవ్యాప్తంగా జియోఫోన్‌లో తొలిసారి వాట్సాప్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబాని వెల్లడించారు. వాట్సాప్‌ కోసం జియోఫోన్‌లో ప్రత్యేకమైన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (కైఓఎస్)ని డెవ‌ల‌ప్ చేశారు. వాట్సాప్ యాప్‌ను ఉపయోగించాలనుకునే జియోఫోన్ వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.