మోటోరోలా నుంచి మోటో జీ6 స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జీ6 స్మార్ట్‌ఫోన్

 మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ6ను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనుంది. రూ.16,250 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానున్నట్లు తెలిసింది. ఇందులో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. 


మోటో జీ6 ఫీచర్లు... 
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.