మోటోరోలా నుంచి జీ7 పవర్ స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి జీ7 పవర్ స్మార్ట్‌ఫోన్

  మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ జీ7 పవర్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.మోటో జీ7 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.