నూతన ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విడుదల చేసిన షియోమీ

నూతన ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విడుదల చేసిన షియోమీ

 మొబైల్స్ తయారీదారు షియోమీ.. మింట్ (Mint) పేరిట ఓ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ బ్రౌజర్‌కు చెందిన యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే లభిస్తున్నది. దీన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సైజ్ కేవలం 10 ఎంబీ మాత్రమే. అందువల్ల దీనికి డివైస్‌లో పెద్దగా స్టోరేజ్ స్పేస్ అవసరం లేదు. తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్, లో ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఈ యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో ట్యాబ్డ్ బ్రౌజింగ్, ఇన్‌కాగ్నిటో మోడ్, రీడింగ్ మోడ్, వాయిస్ సెర్చ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇతర బ్రౌజర్లలాగే ఈ బ్రౌజర్ కూడా యూజర్లకు ప్రైవసీని, సెక్యూరిటీని అందిస్తుందని షియోమీ తెలిపింది.