వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్ విడుదల

వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్ విడుదల

  మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు గాను మెక్‌లారెన్ ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 10 జీబీ ర్యామ్, 30 వాట్ల వార్ప్ చార్జ్ 30 ఫీచర్లను కొత్తగా అందిస్తున్నారు. కేవలం 20 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ ఇందులో పూర్తవుతుంది. ఇక ఈ నూతన వేరియెంట్ బొప్పాయి ఆరెంజ్ రంగు ఫినిషింగ్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో మెక్‌లారెన్ లోగో ఉంటుంది. మెక్‌లారెన్‌కు చెందిన కార్బన్ ఫైబర్‌తో ఈ ఫోన్ బాడీని తయారు చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కూడా మెక్‌లారెన్ యానిమేషన్స్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల మెక్‌లారెన్ అనుభూతి యూజర్లకు వస్తుంది.

వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్ 10జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో రూ.58,855 ధరకు వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇప్పటికే ఈ వేరియెంట్‌ను పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలలో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో భారత్‌లోనూ లభిస్తుంది.

వన్‌ప్లస్ 6టి మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్లు...
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్ బాడీ, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.