ఒప్పో ఎ7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

ఒప్పో ఎ7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

  మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ7ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.20వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో ఎ7ఎక్స్ ఫీచర్లు...
6.3 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.