చాలామంది తమకి సంబంధించిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ఫోన్లలో భద్రపరుస్తున్నారు. నగదు లావాదేవీలు, ఫొటోలు అందులోనే ఉంచుతారు.స్మార్ట్‌ఫోన్‌ని ఎవరైనా దొంగిలించిన, ఎక్కడైనా పోగొట్టుకున్నా ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే ఎక్కడ ఉందో కనిపెట్టేయొచ్చు..!
ఆండ్రాయిడ్, యాపిల్ వంటి స్మార్ట్ఫోన్లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరుచడం వల్ల కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ద్వారా కూడా మీ ఫోన్ కనుగొనలేకపోతే ఈ టిప్స్ ద్వారా ఫోన్‌ని రికవరీ చేసుకోవచ్చు. -ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్‌ను ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి మీరు ఉపయోగిస్తున్న డివైజ్‌ను సెలెక్ట్ చేసుకోండి. -సెక్యూర్ డివైజ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. లాక్ స్క్రీన్ మెసేజ్, ఫోన్ నెంబర్‌ను ఇందులో యాడ్ చేయాలి. -ఫోన్ పోగొట్టుకున్నప్పుడు గూగుల్ అకౌంట్‌ను రిమోట్ విధానంలో నుంచి లాగవుట్ చేసి దాని నుంచి మొత్తం డేటాను తీసేయొచ్చు. -దానికోసం ముందుగా google.com/android/devicemanager లోకి వెళ్లాలి. -మీరు లాస్ట్‌లో ఉపయోగించిన డివైజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ స్థానాన్ని కూడా ఇందులో చూసుకోవచ్చు. -మీరు ఫోన్ దగ్గరలోనే ఉన్నారనుకుంటే ప్లే సౌండ్ పైని నొక్కండి. అది గట్టిగా రింగ్ చేస్తుంది. అప్పుడు డివైస్‌ని కనుక్కోవచ్చు. -ఒకవేళ ఫోన్ దొంగిలించబడితే.. సెక్యూర్ డివైజ్‌ను ప్రెస్ చేసి మీ ఫోన్‌ను లాక్ చేయొచ్చు. ఫోన్లో ఉన్న ఎలాంటి సమాచారాన్నైనా ఎరేజ్ డివైజ్‌ను నొక్కితే డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది.