ఫొటోస్ యాప్‌లో లైవ్ ఆల్బమ్స్ లిమిట్ పెంచిన గూగుల్

ఫొటోస్ యాప్‌లో లైవ్ ఆల్బమ్స్ లిమిట్ పెంచిన గూగుల్

 సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఫొటోస్ యాప్‌లో ఈ ఏడాది అక్టోబర్ లో లైవ్ ఆల్బమ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫొటోలతో ఆల్బమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇందులో లిమిట్ 10వేల ఫొటోల వరకు అప్పట్లో అందించారు. అయితే ఇదే లిమిట్‌ను ఇప్పుడు గూగుల్ పెంచింది. దీంతో ప్రస్తుతం గూగుల్ ఫొటోస్ యాప్‌లో యూజర్లు లైవ్ ఆల్బమ్స్‌లో ఇమేజ్ లిమిట్‌ను 20వేల వరకు పొందవచ్చు. అంటే.. లైవ్ ఆల్బమ్స్‌లో 20వేల ఫొటోలను స్టోర్ చేసుకోవచ్చన్నమాట. కాకపోతే స్టోరేజ్ లిమిట్‌ను బట్టి మాత్రమే ఫొటోలను స్టోర్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.