షావోమి మరో బడ్జెట్‌ ఫోన్‌ త్వరలో

షావోమి మరో బడ్జెట్‌ ఫోన్‌ త్వరలో

 ముంబై: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి త్వరలోనే మరో  బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇప్పటికే బడ్జెట్‌ఫోన్లతో మొబైల్‌ మార్కెట్‌లో సంచలనం రేపుతున్న షావోమి మరోసారి  బడ్జెట్‌ధర,  ప్రీమియం ఫీచర్లతో  భారత వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు షావోమి  ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ ట్విటర్‌ లో ఒక టీజర్‌ను పోస్ట్‌ చేశారు.  తమ  స్లిమ్‌, స్లీక్‌,  కాంపాక్ట్‌ పవర్‌ హౌస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 14న లాంచ్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మి 5 ఇకపై భారతీయు కస్టమర్లకు అందుబాటులోకి తేనుందనే  అంచనాలు భారీగా నెలకొన్నాయి.  రూ.7వేలుగా దీని ధరను నిర్ణయించనుందని సమాచారం.

 

రెడ్‌మి 5 ఫీచర్లు
5.7 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 9
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్‌
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
12 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ