షావోమి మరో స్మార్ట్‌టీవీ లాంచ్‌

షావోమి మరో స్మార్ట్‌టీవీ లాంచ్‌

  న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కె‍ట్‌పై  కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ  ఎంఐ స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది.   ఎంఐ టీవీ4 సిరీస్‌లో  తాజాగా 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌,  డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్  ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  సుమారు రూ.63,300 దీని ధరను నిర్ణయించింది. అయితే బారత మార్కెట్‌లో ఈ టీవీని ఎపుడు లాంచ్‌ చేసేదీ  స్పష్టత లేదు.