షియోమీ నుంచి ఎంఐ ఎ2 లైట్ స్మార్ట్‌ఫోన్

షియోమీ నుంచి ఎంఐ ఎ2 లైట్ స్మార్ట్‌ఫోన్

  చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ ఎ2 లైట్‌'ను ఈ నెల చివర్లో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌కు చెందిన బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, వైట్, రెడ్, పింక్, గ్రే, సిల్వర్ కలర్ వేరియెంట్లు విడుదల కానున్నాయి.

షియోమీ ఎంఐ ఎ2 లైట్ ఫీచర్లు...
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.